మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ప్రజావైద్యం బలోపేతం
వైయస్ ప్రజల కోసం పని చేస్తే కూటమి కార్పొరేట్లకు ఇచ్చేస్తోంది
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీలో మెడికల్ కాలేజీలు ఏర్పాటై దశాబ్దాలు దాటింది. ప్రభుత్వాలు వస్తున్నాయి..పోతున్నాయి కానీ కొత్త మెడికల్ కాలేజీలు రాలేదు..పేదలకు ఆధునిక వైద్యం అందలేదు… ఇలాంటి గడ్డు కాలంలో వైయస్ జగన్ ఏకంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సరిగ్గా మూడేళ్ల క్రితం 2023లో ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పార్వతీపురం..పాడేరు వంటి వెనుకబడిన ప్రాంతాల్లో సైతం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.
2023 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య చరిత్రలో ఒక గొప్ప అడుగు పడింది.
1923 నుంచి 2019 వరకు దాదాపు శతాబ్ద కాలంలో ప్రభుత్వ రంగంలో రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలు కేవలం 12. కానీ మా ఐదేళ్ల పాలనలోనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
అందులో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 మెడికల్ కాలేజీలను 2023 సెప్టెంబర్ 15న ఒకేసారి ప్రారంభించి, 750 ఎంబీబీఎస్ సీట్లను మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కోవిడ్ వంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే మెడికల్ కాలేజీల నిర్మాణాలపై రూ.2,403 కోట్లు ఖర్చు చేశారు. పాడేరు, పులివెందుల కాలేజీలను కూడా అడ్మిషన్లకు సిద్ధం చేశారు.
నాటి ప్రభుత్వ లక్ష్యం కేవలం మెడికల్ కాలేజీలను కట్టడం మాత్రమే కాదు. ఆరోగ్యశ్రీని 1,000 చికిత్సల నుంచి 3,300కు విస్తరించి రూ.25 లక్షల వరకు వైద్యం, గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్స్, ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్, జిల్లా స్థాయిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆస్పత్రులు.. ఇలా పేదవాడికి గ్రామం నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు ఒక బలమైన ప్రభుత్వ వైద్య వ్యవస్థను నిర్మించాలన్నదే వైయస్ జగన్ సంకల్పం. అనుకున్నట్లే కాలేజీలు ఏర్పడ్డాయి..అడ్మిషన్లు మొదలయ్యాయి..పేద విద్యార్థులు ఖర్చు లేకుండా ప్రభుత్వ కాలేజీల్లో మెడిసిన్ చదివే గొప్ప అవకాశం రాష్ట్రంలోని నలు మూలలా కలిగింది
కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే..
మిగిలిన కాలేజీలను పూర్తి చేసి మరిన్ని ఎంబీబీఎస్ సీట్లు తీసుకురావాల్సింది పోయి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటు చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పులివెందులకు మంజూరైన సీట్లను వద్దన్నారు. పాడేరు సీట్లను పరిమితం చేశారు. మన పిల్లలకు రావాల్సిన వైద్య విద్య అవకాశాలను చేజార్చారు.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు గొంతెత్తారు. కోటి మందికి పైగా సంతకాలతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవాలని తీర్పు చెప్పారు. ఆ ప్రజాభిప్రాయాన్ని వైయస్ జగన్ సారధ్యంలోని పార్టీ నేతలు గవర్నర్ దృష్టికీ తీసుకెళ్లారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎవరి వ్యక్తిగత ఆస్తులూ కావు చంద్రబాబుగారూ. అవి ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజల ఆస్తులు. పేద పిల్లల డాక్టర్ కలలకు, పేద కుటుంబాల ఆరోగ్య భద్రతకు అవి భరోసా.
వైయస్ జగన్ ఈ ఆస్పత్రులు నిర్మించింది అమ్ముకోవడానికి కాదు.. తరతరాలకు ఉపయోగపడటానికి. ఇప్పటికైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోండి. మిగిలిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే పూర్తి చేయండి. పేద పిల్లలకు వైద్యవిద్యను, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేసే ప్రయత్నాలు మానుకోండి.
ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయవద్దు.. ప్రజల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించవద్దు…
రాష్ట్రాన్ని అప్పులపాల్జేయడం కాదు..అభివృద్ధి బాటలో నడపండి


