---Advertisement---

రెడ్ బుక్ రాజ్యంగంలో లాకప్ డెత్, కాపు యువకుడు, జనసేన కార్యకర్త బలి!

Lockup death in the Red Book regime; a Kapu youth, Janasena worker sacrificed!
---Advertisement---
  • బెజవాడ పోలీసుల పైశాచికం
  • ఎత్తుకెళ్లి కాలిగోళ్లు పీకి
  • హత్యచేసి శవాన్ని మాయం చేసిన వైనం
  • జనసైనికుడి హత్యతో రాష్ట్రంలో కలవరం
  • కాపు యువతలో అసహనం..
  • ఎక్కడా చప్పుడు లేని పవన్ కల్యాణ్
  • సంచలనంగా మారిన కాపు యువకుడు, జనసేన కార్యకర్త సాయికృష్ణ హత్య కేసు

లోకేష్ చెప్పినట్లుగానే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. పోలీసులు ఎవరినైనా ఎత్తుకెళ్లి ఏమైనా చేసి దిలాసాగా తప్పించుకుని తిరగగలరు అని మరో మారు నిరూపణ జరిగింది. విజయవాడలో సాయి కృష్ణ అనే యువకుడ్ని పోలీసులు నెల క్రితం తీసుకెళ్లి ఏకంగా హత్య చేసి శవాన్ని కూడా దహనం చేశారు. ఈ అంశంపై ఆ కుటుంబం ఎంతమందిని కలిసిన ఎన్ని అర్జీలు పెట్టిన ప్రభుత్వం పోలీసులు కనీసం స్పందించకపోగా తిరిగి ఆ యువకుడే రౌడీషీటర్ అన్నట్లుగా ప్రచారం చేస్తూ..అలాంటివాన్ని చంపేయడం తప్పు కాదు అన్నట్లుగా పోలీసులు తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ పోలీస్ హత్య ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం అయింది.

విజయవాడకు చెందిన కాపు సామాజికవర్గ యువకుడు గాదె సాయికృష్ణ విజయవాడలో కుటుంబంతో ఉంటారు
ఆయన మేనమామ, వారి కుటుంబం రాధా, రంగాతో పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ తరపున చురుగ్గా పాల్గొం టున్నారు. అయితే గాదె సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంకలో అతన్ని తీవ్రం గా హింసించారు. ఆ క్రమంలో గాదె సాయికృష్ణ చనిపోయాడని ఆ కుటుంబానికి సమాచారముంది. పోలీసులు ఆ కుటుంబాన్ని మాయ చేసి సాయికృష్ణను లాకప్ లోనే హింసలతో చంపేశారు.
మృతదేహాన్ని కృ ష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేసేశారు. టూ వీలర్పై ముందు ఒక కానిస్టేబుల్.. వెనుక మరో కానిస్టేబుల్ కూర్చుని.. మధ్యలో శవాన్ని పెట్టుకుని వెళ్లారు. అక్కడ దహనం చేసి, బూడిద కూడా మాయం చేశారు. అయితే పోలీసులు.. కోర్టుకు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు.. వెతుకుతున్నాము. ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నామని చెబుతున్నారు. సాయికృష్ణ తల్లికి సీఐ నాగరాజు ‘మీ అబ్బాయ్ నాకు ఎదురు తిరిగాడు. వాడిని చం పేస్తాను. దండ రెడీ చేసుకో.. అని చెప్పి, మరీ చం పేసిన ఘటన ఇది.

కాపు యువతలో కలవరం…

రాష్ట్రం లో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవ హారం కీలక మలుపులు తిరుగుతోంది. ఏపీలో పోలీసుల పనితీరు, దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తోంది. జనసేన తరఫున పని చేస్తున్న యువకుడిని టిడిపి ప్రభుత్వం హత్యచేయడాన్ని కాపు యువత తీవ్రంగా పరిగణిస్తుంది. అధికారం కోసం మేం ఇంత చేస్తుంటే చివరకు మా ప్రాణాలు తీస్తారా అని వారు లోలోన రగిలిపోతున్నారు

పవన్ కళ్యాణ్ ఎక్కడ ?

కావులంతా తనకోసం ఉండాలని..వారి జీవితాలను మారుస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు ప్రభుత్వంతో తమ ప్రాణాలు తీస్తున్నారని కావు యువత ఆవేదన చెందుతోంది. రాష్ట్ర రాజధానిలో లాకప్ డెత్ జరిగితే జనసేన నుంచి కానీ కాపు నేతల నుంచి కానీ కనీసం స్పందన లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువతను రెచ్చగొట్టడం..వారిని ఎన్నికల కోసం వాడుకోవడం తాను అధికారం పొందడం తప్ప తమ సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరిగి..వారిని పోలీస్ స్టేషన్లలో పెట్టీ హత్యలు చేస్తున్నా ఆయన కనీసం స్పందించకపోవడం ఆయన రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం అని..ఈ తీరును రానున్న ఎన్నికల్లో ఎండగడుతాం అని వారు అంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Related Reports

Leave a Comment