
📚 విద్యాప్రదాత… బాలల భాగ్య విధాత
తలరాతలు మారుతున్న వెంకటప్ప మెమోరియల్ స్కూల్
👨👩👧👦 పులివెందులలో వేలాదిమంది బాలల ఆత్మబంధువు
🏫 వైయస్సార్ కుటుంబం బాసటగా..పేద పిల్లలకు అధునాతన విద్య
తమిళనాట సూర్య తేజం… అగరం ఫౌండేషన్
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలవాలనే లక్ష్యంతో సూర్య 2008లో అగరం ఫౌండేషన్ను ప్రారంభించారు.
పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదివేందుకు వేలాది మంది విద్యార్థులకు సహాయం అందించారు.
కొన్నివేల మంది జీవితాల్లో వెలుగులు నింపిన సూర్య దంపతులు, విద్యార్థుల విజయాల్లో తన మానవత్వాన్ని చాటుకున్నారు.
📖 విద్య… మన తలరాతను మార్చగలిగే గొప్ప సాధనం..జీవితాలను మార్చగలిగే ఆయుధం..
ఒక కుటుంబంలో ఒకరు గొప్పగా చదువుకుంటే ఆ కుటుంబం తీరుతెన్నులు మారిపోతాయి… ఆ చదువుకున్న వ్యక్తి తన బిడ్డలను తన తోబుట్టువులను తల్లిదండ్రులను గొప్పగా చూసుకొని వారి జీవితాలకు కొత్త బాటలు వేయగలిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ అవకాశం అందరికీ ఉండదు… కొందరు బాలలకు తల్లిదండ్రులు ఉండరు.. అనాధ జీవితాలు.. ఆ పూట గడవడమే కష్టం.. ఇక పుస్తకాల కొనుక్కొని బువ్వ తిని బడికి వెళ్లి చదువుకునే అవకాశం ఎక్కడ ? అలాగని చదువు మానేస్తే… ఆ జీవితాలకు సార్ధకత ఏముంది.. పోనీ చదువుదామంటే ఆదరువు ఎక్కడుంది… అలాంటి ఎలాంటి ఆదరణ లేని పిల్లల పాలిట తల్లి తండ్రి అయింది పులివెందులలోని వెంకటప్ప మెమోరియల్ స్కూల్. 🏫
🌱 దివంగత మహానేత వైయస్సార్ హయాంలో పురుడు పోసుకున్న ఈ పాఠశాల నేడు ఒకటి నుంచి 10వ క్లాస్ వరకు దాదాపు 2500 మంది విద్యార్థులకు అత్యధికమైన ఇంగ్లీష్ మీడియం ఉచిత విద్యను అందిస్తోంది. 📚🎓
🍚 విద్య మాత్రమే కాదు వారికి బ్రహ్మాండమైన ఆహార సదుపాయాలతో పాటు హాస్టల్ స్కూల్ పుస్తకాలు బూట్లు స్టేషనరీ ఇలా అన్ని రకాల సహకారాలు అందిస్తూ వారిని సమూనితంగా తీర్చిదిద్దడంలో ఎనలేని సేవ చేస్తుంది. 👞📚📝
వైయస్సార్ ఫౌండేషన్ కింద నడుస్తున్న ఈ స్కూల్లో పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పుతూ తమకు తల్లి తండ్రి ఎవరు లేకపోయినా ఈ వెంకటప్ప స్కూల్ తమకు వెన్నుదన్నుగా నిలిచింది అనే భరోసాను కల్పిస్తోంది.
🎓 గత 20 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని బయటకు వెళ్లి పెద్ద చదువుల్లో ..పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరి తమ జీవితాలను తీర్చిదిద్దుకున్నారు.
🌟 తమకు ఎవరూ లేకపోయినా తమను ఈ స్థాయిలో నిలబెట్టి తీర్చిదిద్దింది వెంకటప్ప స్కూల్ అని వారు గర్వంగా చెప్పుకునే స్థితికి చేరుకున్నారు.
🏫 దివంగత వైయస్సార్ తన అభిమాన ఉపాధ్యాయుడు వెంకటప్ప పేరిట ఏర్పాటు చేసిన ఈ స్కూల్ నిర్వహణ యావత్తు వైఎస్ఆర్ కుటుంబమే చూసుకుంటుంది. పేదింటి బిడ్డలను అక్కున చేర్చుకుని వారికి సకల సౌకర్యాలు కల్పించి . కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసుకొని… ఇంకా చెప్పాలంటే వాటిని తలదన్నేలా నాణ్యమైన అత్యధునికమైన విద్యను అందిస్తూ వారిని సమాజంలో సమున్నతంగా నిలబెడుతోంది. 📚
తమకు ఎవరూ లేరన్న బాధను మర్చిపోయి.. తమకు అన్నీ ఉన్నాయన్న భరోసాను కల్పిస్తూ విద్యను ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తూ తమను వేలు పట్టుకొని ముందుకు నడిపించే వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ఎన్నో వేల జీవితాల్లో వెలుగుపూలు పూజించింది.
🕯️ తల్లి తండ్రి లేరు బంధు వర్గం పట్టించుకోదు… ఇక మా జీవితాలు ఇంతేనా అంటూ చీకట్లో మగ్గిపోయే చిన్నారుల జీవితాలకు దీపం పెట్టి… వారిని వెలుగుల వైపు నడిపించిన వెంకటప్ప స్కూల్ రాష్ట్రానికి ఆదర్శం… 🌟
తల్లిదండ్రులు లేని.. నిరుపేదలైన ఆ బిడ్డలను సొంత బిడ్డలుగా సాకుతూ వారి ఆలనా పాలనా చూస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో నిరంతరం తలమునకలై కలిగి ఉండే వైయస్సార్ కుటుంబం నిజంగా ధన్యత పొందినట్లే..
👩🏫 ఆ స్కూల్లో పనిచేసే అధ్యాపకులు సైతం పిల్లల పాలిట తల్లిదండ్రుల పాత్ర పోషిస్తూ వారిని సంపూర్ణంగా ప్రేమిస్తూ… వారిపట్ల ఎనలేని ఆదరణ కురిపిస్తూ ముందుకు నడిపిస్తున్నారు 📚
🌺 అలాంటి గొప్ప విద్యాలయాన్ని నిర్వహిస్తున్న వైయస్ కుటుంబం… అక్కడి అధ్యాపకులు.. చివరకు అందులో చదువుకుంటున్న పిల్లలు.. అందరూ ధన్యజీవులే
HappyTeachersDay
హ్యాపీ టీచర్స్ డే
